Chiranjeevi As God Father :మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. రీసెంట్గా ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీటైంది. ఈ సినిమా ‘గాడ్ ఫాదర్’ ప్రకటించగానే అభిమానుల్లో వైబ్రేషన్స్ మొదలైంది. గతంలో ఈ సినిమా టైటిల్‌తో ఓ సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
అటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాత సూపర్ హిట్ టైటిల్స్‌తో ఆయన సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. అందులో ‘గాడ్ ఫాదర్’ మూవీ ఒకటి. గతంలో ఈ సినిమా టైటిల్‌తో టాలీవుడ్లో ఓ సినిమా కూడా వచ్చింది. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ఇక మెగాస్టార్ ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో చేసిని సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
దేవాంతకుడు | చిరంజీవి యాక్ట్ చేసిన పాత సినిమా టైటిల్స్‌తో తెరకెక్కిన చిత్రం ‘దేవాంతకుడు’. ఈ సినిమా పేరుతోనే ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఇక ఎన్టీఆర్ నటించిన ఈ సినిమానే కాస్తా అటు ఇటు మార్చి ‘యమగోల’ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఆరాధన | చిరంజీవి.. భారతీ రాజా దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఆరాధన’. ఈ సినిమా టైటిల్స్‌తో మొదట అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఓ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టైయినట్టు చిరంజీవి సినిమా బాక్పాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
జేబు దొంగ | చిరంజీవి నటించిన సినిమాల్లో ’జేబుదొంగ’సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేకపోయినా.. అభిమానులకు మాత్రం ఇందులో చిరంజీవి కామెడీ మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. గతంలో ఇదే టైటిల్‌తో శోభన్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. (File/Photo)
గాడ్ ఫాదర్ | గాడ్ ఫాదర్ టైటిల్‌తో చిరంజీవి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టైటిల్‌తో హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఉంది. ఈ సినిమా స్పూర్తితో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇదే టైటిల్‌తో ఏఎన్నార్, వినోద్ కుమార్ హీరోలుగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇపుడు అదే టైటిల్‌తో చిరంజీవి మలయాళంలో హిట్టైన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో పలు మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు. మరి ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో చిరంజీవి హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)