ఇకపోతే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2023 జనవరి 11వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవిని చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.