మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘యమ కింకరుడు’. ఇక అల్లు అరవింద్ సోలో నిర్మాతగా చిరు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘యమ కింకరుడు’. రాజ్ భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1979లో ఇంగ్లీష్‌లో వచ్చిన ‘మ్యాడ్ మాక్స్’ సినిమాను స్పూర్తిగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్నే నమోదు చేసింది. (Youtube/Credit)
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘హీరో’. ఈ చిత్రం హాలీవుడ్లో హిట్టైన ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ మూవీని తెలుగులో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన నాల్గో చిత్రం ‘విజేత’. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘సాహెబ్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బాల నటుడి పాత్రలో కనిపించారు. (Youtube/Credit)
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన ఐదో చిత్రం ‘ఆరాధన’. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కడలోరా కవితైగల్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రాజశేఖర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. (Youtube/Credit)
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం ‘పపివాడి ప్రాణం’. ఈ చిత్రం మలయాళంలో మమ్మట్టి హీరోగా నటించిన ‘పూవిన్ను పుతియ పూంతెన్నెల్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా తెలుగులో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాతో చిరంజీవి.. తెలుగులో నెంబర్ వన్ హీరో అయ్యారు. ‘ఖైదీ’ తర్వాత చిరుకు ఇది రెండో ఇండస్ట్రీ హిట్ మూవీ. (Twitter/Photo)
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదో చిత్రం ‘ప్రతిబంధ్’. ఈ చిత్రం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘అంకుశం’ సినిమాకు హిందీ రీమేక్. దర్శకుడిగా రవిరాజ పినిశెట్టికి హీరోగా చిరంజీవికి నిర్మాతగా అల్లు అరవింద్‌కు ఇదే హిందీలో ఫస్ట్ మూవీ. తొలి హిందీ చిత్రంతోనే బాలీవుడ్లో సక్సెస్ అందుకున్నారు చిరంజీవి, అల్లు అరవింద్, రవిరాజ పినిశెట్టి. (Twitter/Photo)
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన పదకొండో చిత్రం ‘SP పరశురాం’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, జీకే రెడ్డి, ముఖేష్ ఉదేషితో కలిసి సంయుక్తంగా తెరకెక్కించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వాల్డర్ వెట్రివెల్’ చిత్రానికి రీమేక్. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)