తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఆసక్తికరమైన పోటీలు ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర కొందరు హీరోలు పోటీ పడినపుడు అభిమానులు పండగ చేసుకుంటారు. అందులో ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య గురించి చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ ఇద్దరూ దాదాపు 18 సార్లు పోటీ పడ్డారు. ఇదిలా ఉంటే చిరంజీవి, వెంకటేష్ కూడా బాగానే బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగారు.
మధ్యలో చిరు రాజకీయాల్లోకి వెళ్లడం.. సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో గత 20 ఏళ్లుగా ఈ ఇద్దరి సినిమాలు పోటీ పడే ఛాన్స్ దొరకలేదు. కానీ ఇన్నేళ్ళ తర్వాత మరోసారి నారప్ప, ఆచార్య రూపంలో ఒక్కరోజు వ్యవధిలో వెంకటేష్, చిరంజీవి పోటీకి వస్తున్నారు. మరి గతంలో చిరు, వెంకీ పోటీ పడిన సందర్భాలెన్ని.. ఎవరెన్ని సార్లు విజయం అందుకున్నారు..?