Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వేదాలం సినిమాలను రీమేక్ చేస్తున్నారు. తాజాగా మరో సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.