పిల్లలూ దేవుడు చల్లని వారే.. కల్లకపటం ఎరుగని కరుణామయులే అంటూ పాటలో చెప్పినట్లు.. నిజంగానే చిన్న పిల్లలు కల్మషం లేని మల్లెపువు అంత స్వచ్ఛమైన వాళ్లు. అలాగే పిల్లలు అల్లరి పిడుగులు కూడా. అలాంటి అల్లరి పిడుగులను ముఖ్య పాత్రల్లో పెట్టి సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కొన్ని చిన్న పిల్లల సినిమాలు వచ్చాయి. అందులో హీరోలు పిల్లలే.. వాళ్లే ముందుండి సినిమాలను నడిపించారు. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలున్న సినిమాల్లోనూ పిల్లలు కథ నడిపించారు. అవి ఇప్పటికీ బెస్ట్ చిన్న పిల్లల సినిమాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి. అలా తెలుగులో వచ్చిన ది బెస్ట్ చిల్డ్రన్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..