Samantha: హీరోయిన్ సమంత గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. 2010లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇండస్ట్రీలో సెల్ఫ్ మేడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సమంత చదువుకునే రోజుల నుంచి అగ్రస్థానంలో ఉండేదని ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఆమె క్లాస్‌లో టాపర్‌గా నిలిచిందని అంటున్నారు. సమంత చిన్నాప్పుడు కరాటే కూడా నెర్చుకుంది.
Taapsee Pannu: దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన నటి తాప్సీ. ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో చర్చల్లో ఉంటుంది తాప్సీ. ఢిల్లీలోని సిక్కు కుటుంబానికి చెందిన తాప్సీ హీరోయిన్‌తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పని చేసింది. చదువుకునే రోజుల్లో చదువుతోపాటు క్రీడలు, డ్యాన్స్ లో తన సత్తా చాటేది. ఆమె చిన్నప్పటి నుంచి టాపరేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Shriya Saran: ప్రముఖ బాలీవుడ్ మరియు దక్షిణాది సినిమా నటి శ్రియా శరణ్ హరిద్వార్‌లో జన్మించారు. ఆమె తండ్రి BHEL ఉద్యోగి మరియు ఆమె తల్లి కెమిస్ట్రీ టీచర్. సినిమా అయినా, నిజ జీవితమైనా.. దాని సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతారు. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ తదితర అగ్రహీరోలతో కలిసి నటించిన శ్రియా ఇప్పటికే తనకు తగిన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆమె చిన్నతనంలోని క్యూట్ ఫొటో మీ కోసం.