Anikha Surendran: సినీ ఇండస్ట్రీకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అనికా సురేంద్రన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అజిత్ నటించిన ఎంతవాడుగాని, విశ్వాసం వంటి సినిమాలలో అజిత్ కూతురుగా నటించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో బాలనటిగా నటించింది. ఇక త్వరలోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటో షూట్ లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి సోషల్ మీడియాలో బాగానే పోరాటం చేస్తుంది. తాజాగా కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో చీరకట్టులో పచ్చని తోటలో పూల అలంకరణతో ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు మాత్రం తన అందాలను తెగ పొగుడుతున్నారు.