ఈ రోజుల్లో ఏ సినిమా విడుదలైనా కూడా ముందుగా అది వివాదంలోకి వెళ్లిపోతుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. మొన్న విడుదలైన తమిళ్ స్టార్ హీరో సూర్య జై భీమ్ కూడా వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సంచలన విజయం సాధించింది. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రశంసల జల్లు కురుస్తుంది.