ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మాత్రం ఇంట గెలవకుండానే రచ్చ చేస్తున్నారు. ఈయన హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్‌లో వందల మిలియన్స్ కొద్ది వ్యూస్‌తో నార్త్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
బెల్లంకొండ శ్రీను విషయానికొస్తే.. ‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తొలి సినిమాలోనే సమంతతో రొమాన్స్.. తమన్నాతో ఐటెం సాంగ్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు. వెనకాల కొండండ అండ బెల్లంకొండ సురేష్ ఉండటంతో ఇది సాధ్యమైంది. ముందు నుంచి ఈ బెల్లంకొండ బాబు కాంబినేషన్స్ నమ్ముకొనే సినిమాలు చేసాడు. ఇపుడు అదే చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ హిందీ ఛత్రపతి మూవీకి రాజమౌళి క్లాప్ కొట్టడం విశేషం.
చత్రపతి హిందీ రీమేక్‌ను పెన్ స్డూడియోస్ నిర్మిస్తోంది. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మార్చారని టాక్. ఇక తెలుగులో బెల్లంకొండను వెండితెరకు పరిచయం చేసిన వినాయక్.. హిందీలో లాంఛ్ బాధ్యతలను తీసుకోవడం విశేషం. ఇక వీళ్లిద్దరికి ఇదే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. Photo : Twitter
ఛత్రపతి హిందీ రీమేక్‌ను మే 12న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో బెల్లంకొండ హిట్ కొట్టాలనే టాస్క్ పెద్దదే అని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ సినిమాలేవి పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అక్షయ్ కుమార్.. మలయాళీ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ ‘సెల్ఫీ’, కార్తీక్ ఆర్యన్ .. ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ‘షెహజాదా’ .. అటు హృతిక్ రోషన్. ‘విక్రమ్ వేధ’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. ఒక్క ‘దృశ్యం 2’ మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)