Karan Johar: బడా నిర్మాత బర్త్ డే పార్టీలో ఛార్మి హంగామా.. హత్తుకొని మరీ ముద్దులు
Karan Johar: బడా నిర్మాత బర్త్ డే పార్టీలో ఛార్మి హంగామా.. హత్తుకొని మరీ ముద్దులు
Karan Johar Birthday: నిన్న మే 25న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరణ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. ఈ వేడుకలో ఛార్మి హంగామా కనిపించింది.
నిన్న మే 25న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరణ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. ఈ వేడుకలో ఛార్మి హంగామా కనిపించింది.
2/ 10
50వ పుట్టిన రోజు కావడంతో ముంబైలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు కరణ్. బాలీవుడ్ సినీ తారలతో పాటు టాలీవుడ్ నుంచి ఛార్మి, పూరి జగన్నాథ్, విజయ్ దేవకొండ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.
3/ 10
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్, తాను రూపొందిస్తున్న సినిమా విశేషాలు పంచుకునే ఛార్మి తాజాగా కరణ్ బర్త్ డే పార్టీ ఫొటోస్ షేర్ చేసింది.
4/ 10
ఈ ఫొటోల్లో బర్త్ డే బాయ్ కరణ్‌తో ఎంతో చనువుగా కనిపించింది ఛార్మి. ఆయన్ను హత్తుకొని మరీ ఫొటోలకు పోజులిస్తూ తెగ ఎంజాయ్ చేసింది. అంతేకాదు ఇతను 50 ఇయర్స్ గోల్డ్ అంటూ కామెంట్ చేస్తూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
5/ 10
చాలా గ్రాండ్‌గా జరిగిన కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లో బాలీవుడ్ తారలు, సౌత్ హీరోయిన్లు మెరిశారు. కళ్ళు మిరమిట్లు గొలిపే డ్రెస్‌లలో తళుక్కున మెరిశారు యంగ్ హీరోయిన్లు. బాలీవుడ్ సెలబ్రిటీ జోడీ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ జంటగా ఈ పార్టీకి హాజరయ్యారు.
6/ 10
పార్టీకి వచ్చిన బాలీవుడ్ తారలందరితో సరదాగా ఉంటూ కెమెరాకు పని చెప్పింది ఛార్మి. రవీనా టాండన్, సోనాలి బింద్రేలతో ఫొటోలకు పోజులిచ్చింది. మై ఫేవరేట్ లేడీస్ అంటూ ఈ ఇద్దరిపై ప్రేమ కురిపించింది ఛార్మి.
7/ 10
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛార్మి, కరణ్ జోహార్ నడుమ స్నేహ బంధం మరింత బలపడింది.
8/ 10
ఇక ఈ వేడుకలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఈ ఇద్దరి ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
9/ 10
పూరికి, ఛార్మికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కరణ్ జోహార్. ఇప్పటికే చాలా పార్టీల్లో కరణ్, పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ సహా అంతా కలిసి చిల్ అయ్యారు.
10/ 10
పాన్ ఇండియా మూవీగా రాబోతున్న లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నారు.