లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.