సినిమాల్లో కొన్ని దశాబ్ధాల పాటు చక్రం తిప్పిన నందమూరి తారక రామారావు.. 57 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేసారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాసారు అన్నగారు.
ఎమ్.జి. రామచంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉన్న పేరు ఇది. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలా అయితే అన్నగారో.. అక్కడ తమిళనాట ఎమ్జీఆర్ కూడా అంతే. అన్నాడిఎంకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఈయన.
ఎమ్జీఆర్ సమకాలీకులుడు శివాజీ గణేషన్ కూడా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత తమిళగ మున్నేట్ర మున్నయ్ అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీతో శివాజీ గణేషణ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు.
జయలలిత.. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తెలుగు వాళ్లకు కూడా నటిగా సుపరిచితం అయిన అమ్మ.. ఆ తర్వాత అన్నాడిఎంకే పగ్గాలు తీసుకుని రెండున్నర దశాబ్ధాల పాటు తమిళనాట చక్రం తిప్పింది.
తెలుగునాట ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయప్రద.. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ముందు తెలుగు దేశం తరుపున రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ తరుపున ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్ పూర్ లోక్‌సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ఎల్డీ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా బీజేపీలో జాయిన్ అయిన జయప్రద మరోసారి రామ్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు.
మెగాస్టార్‌గా చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థిాపించాడు చిరు. కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయాడు చిరంజీవి. తర్వాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయాడు మెగాస్టార్.
భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించి 1967లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాలుగో లోక్‌సభకు ఎన్నికయ్యారు. భారత దేశంలో ఒక నటుడు పార్లమెంటు సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతోనే మొదలైంది.
కృష్ణంరాజు కూడా నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేసారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకు ఎక్కాడు.
విజయశాంతి కూడా బీజేపీ,తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు.టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ తరుపున 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ..ఆ తర్వాత టీడీపీ.. ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు.
రావు గోపాల్ రావు, తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టారు.
సీనియర్ నటుడు సత్యనారాయణ కూడా 1996లో తెలుగు దేశం పార్టీ తరుపున మచిలి పట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన బాబు మోహన్..అప్పట్లో బాబు క్యాబినేట్లో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత టీఆర్ఎస్, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
జయా బచ్చన్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. ఎంపిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తనకంటూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈమె. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
రెబల్ స్టార్‌గా బాలీవుడ్లో సంచలన సినిమాలు చేసిన శత్రుఘ్న సిన్హా ఆ తర్వాత రాజకీయాల్లోనూ సత్తా చూపించారు. బిజేపీలో ఆయన పలు కీలక పదవులు అధిష్టించారు. తాజాగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం రోజునే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ముంబై నార్త్ ఈస్ట్ నుంచి సునీల్ దత్ ఏకంగా ఐదుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ దత్ తనదైన ముద్ర వేసారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పని చేసారు.
బాలీవుడ్ స్టార్ దేవానంద్ ఒకరు. 1980లో ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ... 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది.
2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా గెలిచిన గోవిందా.. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.
మనోజ్ తివారి.. మనకు పెద్దగా తెలియని పేరు. కానీ భోజ్‌పురిలో సంచలనం ఈ పేరు. అక్కడ సూపర్ స్టార్‌గా సేవలు అందిస్తూనే రాజకీయాల్లోనూ సత్తా చూపించాడు మనోజ్ తివారి. ప్రస్తుతం బీజేపీ తరుపున ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏడాది కిందే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ వైపుగా అడుగులు అయితే వేయలేదు సూపర్ స్టార్. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
కమల్ హాసన్ కూడా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా మారిపోయారు. ఈయన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ తరుపున తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నారు. ఈయనకు ఎలక్షన్ కమిషన్ టార్చిలైట్ గుర్తును కేటాయించింది.
పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఈయన తన సినిమా కెరీర్ కాదనుకుని జనసేన పార్టీతో బిజీగా మారిపోయాడు. గత ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగాడు. తెలంగాణలో ఒకటి రెండు సీట్లలో పోటీ చేస్తున్నాడు. ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది.
టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజా.. ఆ తర్వాత కాంగ్రెస్, ఆపై జగన్ వైసీపీలో జాయిన్ అయి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇపుడు మరోసారి MLA గా పోటీచేస్తున్నారు.
విజయ్ కాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నాడు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన.. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ ఎన్నికల్లో ఈయన పార్టీ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీ పొత్తులో భాగంగా 4 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది.
ఇన్నాళ్లూ సినిమాలతో తన విలక్షణత చూపించిన నటుడు ప్రకాశ్‌రాజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎంపిగా పోటీ చేస్తున్నాడు.
టీవీ నటిగా పాపులర్ అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయి మోడీ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమేథిలో రాహుల్ గాంధీపై మరోసారి పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు.