Celebrities Marriages 2021 : సునీత, ప్రణీత, శ్రద్ధా ఆర్య సహా ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు వీళ్లే..

Celebrities Marriages 2021: ఈ యేడాది 2021లో కరోనాతో ఎంతో మంది సినీ ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు. ఈ యేడాది మొదట్లో సింగర్ సునీత .. ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, దియా మీర్జా, విష్ణు విశాల్, ఆపై ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కారు. రీసెంట్‌గా యామీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా శ్రద్ధా ఆర్య కూడా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. మొత్తంగా 2021లో పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేయండి.