Payal Rajput: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ పాయల్ రాజ్పుత్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న పాయల్ పై పోలీస్ కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభత్సవంకు పాయల్ వచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో పాయల్ రాజ్పుత్ మాస్కు ధరించకపోవడంతో కరోనా నిబంధనలు పాటించలేదని ఆమెపై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. మరి ఈ కేసుపై పాయల్ రాజ్పుత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.