కార్తీక దీపం సీరియల్లో నటించే నటీనటులందరూ తెలుగు ప్రేక్షకులకు ఇంటి సభ్యులు అయిపోయారు. వాళ్లను సీరియల్ ఆర్టిస్టులుగా కంటే కూడా కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు. ఇక దీపను అయితే తమ ఇంట్లో మనిషిని చేసుకున్నారు. అక్కడ వంటలక్క ఏడిస్తే.. ఇక్కడ ఆడవాళ్లు కూడా కంటతడి పెడుతుంటారు. డాక్టర్ బాబు ఏదైనా అంటే.. మన వాళ్లే ఎదురు తిరుగుతుంటారు.
అంత కనెక్ట్ అయిపోయారు ఈ సీరియల్‌కు. ఇదిలా ఉంటే ఈ సీరియల్లో హీరో నిరుపమ్ పరిటాల.. అతడి తల్లి అర్చన అనంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే వీళ్ళ సొంత పేర్ల కంటే కూడా డాక్టర్ బాబు లేదంటే కార్తీక్‌గా నిరుపమ్.. సౌందర్యగా అర్చన బాగా చేరువయ్యారు. ఈ ఇద్దరూ తల్లి కొడుకులుగా సెట్ అయిపోయారు.
నిజంగానే నిరుపమ్‌కు అర్చన అమ్మ ఏమో అనుకుంటారు. అంత బాగా కలిసిసోయారు ఈ ఇద్దరూ. మరోవైపు అర్చన కూడా అమ్మ పాత్రలో అంత చక్కగా ఒదిగిపోయింది. ఈమె లుక్ చూసిన తర్వాత అర్చనకు వయసు 40 పైనే ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ ఈమె రియల్ ఏజ్ తెలిస్తే షాక్ అవుతారు. పైగా నిరుపమ్, అర్చన మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలిస్తే మాత్రం నిజంగానే ఖంగు తింటారు.
ఎందుకంటే తల్లి కొడుకులుగా నటిస్తున్నారంటే కనీసం ఈయన కంటే పదేళ్ళైనా పెద్దది ఉంటుందని అంతా ఊహిస్తారు కానీ ఈ ఇద్దరూ ఒకే ఏడాదిలో జన్మించారని తెలుసా..? ఈ మాట వినడానికి కూడా చాలా మందికి షాకింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఇదే నిజం.. అర్చన, నిరుపమ్ ఒకే ఏడాది పుట్టారు. 1988 జనవరిలో అర్చన జన్మిస్తే.. అదే ఏడాది చివర్లో నిరుపమ్ పుట్టాడు.
ఇదిలా ఉంటే ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. ఒకప్పట్లా దీనికి రేటింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా సాగతీత ఎక్కువ కావడంతో రెగ్యులర్ ఆడియన్స్ కూడా కార్తీకదీపం సీరియల్ చూడటం లేదు. అది కాకుండా అదే ఛానెల్లో వచ్చే వదినమ్మ లాంటి సీరియల్స్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఒకప్పట్లా ఇప్పుడు వంటలక్క మ్యాజిక్ చేయాలంటే ఏదైనా అద్బుతం జరగాల్సిందే.