మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నదున్నట్టు మాట్లాడడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో మెగా డాటర్ నిహారిక కూడా ఉంటుంది. ఈమె కూడా పెద్దగా దాపరికం మెయింటెన్ చేయదు. ఇంటర్వ్యూల్లో కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు నో అనకుండా సమాధానం చెబుతుంది నిహారిక. తాజాగా ఈమె ఆలీతో సరదాగా షోకి వచ్చింది. ఇందులో కూడా చాలా సరదాగా కనిపించింది మెగా డాటర్.
చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇంట్లో కొట్టుకుంటూ పెరిగాం అని చాలా వ్యక్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం పర్సనల్ గానే కాకుండా ప్రొఫెషనల్ గా కెరీర్ పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది నిహారిక. ఇకపై నటిగా చేస్తుందో లేదో తెలియదు కానీ.. నిర్మాతగా మాత్రం బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ వెబ్ సిరీస్ నిర్మించింది నిహారిక.