నాగార్జున అక్కినేని కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యింది. ఈ సినిమాని తెలుగు సహా మిగతా దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. (Photo twitter) (Twitter/Photo)
నవంబర్ నాలుగు నుంచి బ్రహ్మస్త్ర మూవీ డిస్నీ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం రిలీజ్ తర్వాత కాస్త మిక్సిడ్ టాక్ నే ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలోకూడా ఇప్పుడు అలాంటి టాక్ వస్తోంది. థియేటర్లలో చూడని వారు..ఇప్పుడు ఓటీటీలో కూడా కొందరు బావుందని.. మరికొందరు బాగాలేదని అంటున్నారు.
బ్రహ్మస్త్ర కథ చూస్తే.. ఈ ప్రపంచంలో అనేక అస్త్రాలను సృష్టించిన బ్రహ్మదేవుడు తన పేరిట ఒక బ్రహ్మ అస్త్రాన్ని కూడా సృష్టిస్తాడు. ప్రపంచంలోని అస్త్రాలన్నింటికీ ఈ బ్రహ్మాస్త్రమే అధిపతి. అయితే ఈ బ్రహ్మాస్త్రాన్ని సంరక్షించే బాధ్యత అస్త్రాలన్నింటినీ తీసుకున్న బ్రహ్మన్ష్ సభ్యులకే అప్పచెప్పారు. అలాంటి టీంలో ఒకరైన మోహన్ భార్గవ(షారుక్ ఖాన్) మీద జునూన్(మౌని రాయ్) దాడి చేసి అతని దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రంలోని ఒక భాగాన్ని అపహరిస్తుంది.. Photo Twitter (Photo Twitter)