బ్రహ్మానందం | గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన హాస్యంతో తెలుగువారిని అలరించారు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి ఉండాల్సిందే. అలాంటి ఈయన అతి తక్కువ సమయంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించినందుకు ఈయన 2010లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. దాని కోసం పగలు రాత్రి ఎంతో కష్టపడాల్సి ఉంటోంది. అలాంటి అద్భుతమైన రికార్డులను బ్రహ్మానందం సహా కొందరు తెలుగు సినిమా సెలబ్రిటీస్ సొంతం చేసుకున్నారు. వాళ్లెవరో చూద్దాం..
దాసరి నారాయణ రావు | దాసరి నారాయణ రావు ప్రపంచంలో ఎక్కువ చిత్రాలను దర్శకత్వం వహించిన ఏకైక వ్యక్తిగా గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు ఒక దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, పాటల రచయతగా, పాత్రికేయుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అసమాన ప్రతిభాశాలిగా కీర్తి ఘడించారు. (Twitter/Photo)
రామానాయుడు: మూవీ మొఘల్ రామానాయుడు కూడా గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన 13 భాషల్లో 150కి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రామానాయుడుకి అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా 2008 లో గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈయన కరెన్సీ నోటుపై ఉన్న అన్ని భాషల్లో చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్‌గా రికార్డులకు ఎక్కారు. (file/Photo)
దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం: 53 ఏళ్ల పాటు పాటలు పాడి అలరించిన ఈ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా 2001లో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన దాదాపు 40 వేల పాటలు పాడారు. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఆరు నేషనల్ అవార్డులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులకు లెక్కేలేదు. ఈయన తెలుగులో అక్కినేని తర్వాత మూడు పద్మ పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.