బాయ్‌కాట్ ట్రెండ్.. ఇపుడు ప్రస్తుతం బాలీవుడ్ బడా స్టార్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రీసెంట్గా బాలీవుడ్ అగ్ర నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌తో బాక్సాఫీస్ దగ్గర కనుమరుగైంది. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం వారు పిలుపునిచ్చారు. అసలు ఈ సినిమాను ఎందుకు బాయ్‌కాట్ చేయాలనుకుంటున్నారు. అసలు కారణాలు ఏమిటంటే.. (Twitter/Photo)
గతంలో ఆమీర్ ఖాన్.. తనకు ఈ దేశంలో అసహనం పెరిగిపోయింది. ఇక్కడ ఉండలేను అంటూ చేసిన కామెంట్స్‌తో పాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేసిన ‘PK’ సినిమాలో ఓ వర్గం వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఆమీర్ నటించారు. దీంతో ఆయా వర్గాలు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వంటి ప్రముఖులు ప్రచారం చేసినా.. ఫలితం దక్కలేదు. (File/Photo)
తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ .. ముందుగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరు అనుకున్నారు. హీరో పేరు రూమీ అంటూ గతంలో ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెటింట్లో వైరల్ అయ్యాయి. ఇక పుల్వామా ఎటాక్ తర్వాత ఈ సినిమా పేరు ‘బ్రహ్మాస్త్ర’గా .. హీరో పేరును రూమీ కాస్త శివగా మార్చారు. Brahmastra Photo/ Twitter
గతంలో ఈ రియల్ లైఫ్ కపుల్ .. బీఫ్ (గొడ్డు మాంసం) తినే విషక్ష్ంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అదే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చాయనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా వీళ్లు ‘బ్రహ్మాస్త్ర’ విడుదల సందర్భంగా మహా కాళేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన వీళ్లకు అక్కడ కొంత మంది వీరిని అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
దైవ దర్శనానికి వచ్చిన అయాన్ ముఖర్జీ, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్లకు వ్యతిరేకంగా నల్ల జెండాలు పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని అలియా చాలా ఏళ్ల కిందట చెప్పిన ఓ క్లిప్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట రణ్ బీర్ తాను మటన్, చికెన్ తో పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. దాంతో, అలియా, రణ్ బీర్ లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఫ్ తినే వాళ్లను గుడిలోకి రానివ్వలేదు. వాళ్లను ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు. దీంతో అయాన్ ముఖర్జీ ఒక్కరే దర్శనం చేసుకొని వెళ్లిపోయారు. (Twitter/Photo)
దీంతో పాటు ఆలియా భట్ తల్లి.. సోనీ రజ్దాన్.. తనకు భారత దేశం కంటే పాకిస్టాన్‌లో ఉంటే హ్యాపీగా ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఆలియా కూడా తన సినిమాలు నచ్చకపోతే చూడకండి అంటూ అహంకార పూరితంగా చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఊతమిచ్చాయి. Alia bhatt instagram