కియారాతో ఎఫైర్... క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హీరో

సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్ అంటూ వచ్చే వార్తలపై ఎక్కువగా హీరోయిన్లు రియాక్ట్ అవుతుంటారు. కానీ కియారా అద్వానీతో తనకు ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా రియాక్ట్ అయ్యాడు. కొంతకాలంగా కియారా, సిద్ధార్థ్ ఉండే బాంద్రాలోని ఇంట్లోనే ఉంటోందని ఓ టాబ్లాయిడ్ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన సిద్దార్థ్... దేశమంతా కరోనా కట్టడి కోసం ఆలోచిస్తుంటే... కొందరు ఏ మాత్రం నిజం లేదని వార్తలను వ్యాపిస్తున్నారని అయ్యాడు. అసలు తనకు కియారాకు ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి కియారాతో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలు... బాలీవుడ్ యంగ్ హీరోను మరీ ఇంతగా ఎందుకు టెన్షన్ పెట్టాయో అని సినీజనం చెవులు కొరుకుంటున్నారు.