Shradda Kapoor : టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ.. హద్దులు చెరిపేసారు.
బాలీవుడ్ అందాల భామల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ చిన్నది అందం అభినయం తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈ స్టార్ హీరోయిన్ రేస్ లోకి చేరిపోయింది.
2/ 6
ఆషీకీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు , స్టార్ హీరోల సినిమాలుశ్రద్ధాను వెతుకుంటూ వచ్చాయి.
3/ 6
ఈ అమ్మడు నటనతోనే కాదు తన డ్యాన్స్ లతో కూడా అలరిస్తుంది. హీరోలకు సమానంగా స్టెప్పులు వేస్తూ.. సత్తా చాటుకుంటుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో డార్లింగ్ కు సమానంగా యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.
4/ 6
టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ.. హద్దులు చెరిపేసారు.
5/ 6
ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది శ్రద్ధా. 60 మిలియన్ల ఫాలోవర్ల రికార్డును చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇంత ప్రేమ, అభిమానం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలిపింది.
6/ 6
సాహో సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకు శ్రద్ధా కపూర్ టాలీవుడ్ సినిమా పై ఎలాంటి అనౌన్స్ మెంట్ జరగలేదు.