Bollywood Top 1 Gross Net Collections Movies : ఒకప్పుడు భారతీయ సినిమాలంటే హిందీ సినిమాల పేర్లు చెప్పేవారు. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమాతో దక్షిణాది సినిమాల సత్తా ఏమిటో బాలీవుడ్‌కు తెలిసింది. అంతేకాదు అక్కడ ఫస్ట్ డే హిందీలో మంచి వసూళ్లను సాధించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ హిందీలో రూ. 20 కోట్ల వరకు మొదటి రోజు వసూళ్లను సాధించింది. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 హిందీలో రూ. 53.95 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు హిందీ చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ ఈ రికార్డును బ్రేక్ చేసి హీరోగా తన స్టామినా ఏంటో చూపించాడు.
1. పఠాన్ | షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన సినిమా పఠాన్. దీపికా పదుకొణే కథనాాయికగా నటించింది. ఇండియన్ స్పై ఏజెన్సీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మొదటి రోజు బాలీవుడ్లో రూ. 55 కోట్ల అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు షారుఖ్. (Twitter/Photo)
2. KGF Chapter 2 | యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ వెర్షన్లో మొదటి రోజు రూ. 53.95 కోట్ల గ్రాస్ వసూళు చేసి సంచలనం రేపి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా షారుఖ్ ‘పఠాన్’ రాకతో రెండో ప్లేస్‌కి పడిపోయింది. (Twitter/Photo)
7. బాహుబలి 2 | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘బాహుబలి 2’. ఈ సినిమా ఇప్పటికీ చైనా మినహాయిస్తే.. మన దేశ బాక్సాఫీస్ విషయానికొస్తే నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమా హిందీలో మొదటి రోజు రూ. 41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం రేపింది. అంతేకాదు 7వ స్థానంలో ఉంది. (Twitter/Photo)
9. సుల్తాన్: సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన సినిమా సుల్తాన్. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా రూ. 615 కోట్లు వసూలు చేసి ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు .. రూ. 36.54 కోట్ల గ్రాస్ వసూళ్లతో 9వ స్థానంలో ఉంది. (Twitter/Photo)
10. బ్రహ్మాస్త్ర | అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్ ముఖ్య పాత్రల్లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే బాలీవుడ్లో రూ. 36.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 10లో నిలిచింది. (File/Photo)
11. సంజు: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. 2018లో విడుదలైన ఈ సినిమా రూ. 580 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు రూ. 34.75 కోట్ల వసూళ్లను సాధించి 11వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)