ఇలాంటి సమయంలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూర్యవంశీ సినిమా బాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరిసారు. 1993 బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు రోహిత్. ఎప్పటిలాగే రొటీన్ కథను తీసుకున్నా కూడా తన కమర్షియల్ స్టామినా ఏంటో మరోసారి చూపించాడు ఈ దర్శకుడు.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 36 కోట్ల గ్రాస్.. అలాగే రెండో రోజు దాదాపు 23 కోట్ల వరకు వసూలు చేసింది మూడో రోజు 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న వసూళ్ళు చూసిన తర్వాత బాలీవుడ్ దర్శక నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. ఇకపై ధైర్యంగా తమ సినిమాలను విడుదల చేసుకోవచ్చు అంటూ గుండె మీద చేయి వేసుకుని కూర్చుంటున్నారు.
మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అలాగే నైజాంలో కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది సూర్యవంశీ. ఈ సినిమాకు తెలంగాణలో రెండు రోజుల్లో 3 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. మొత్తంగా ఎలా చూసుకున్నా కూడా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల మోత మోగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు నిర్మాతలు.