ఈ స్టార్ జోడికి ప్రీ వెడ్డింగ్ వేడుకలను శని, ఆదివారాలు జైసల్మేర్‌లోని సూర్యాఘర్ ప్యాలెస్‌లోనే జరుగుతున్నాయి. నూతన వధువరుల బంధువులు మొత్తం 150 మంది వరకు ఉండవచ్చని తెలుస్తోంది. వీరితో పాటు బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన మరికొందరు సెలబ్రిటీలు ఈ మ్యారేజ్ ఫంక్షన్‌కు అటెండ్ అవుతున్నారు. (Photo:Instagram)
సూర్యఘర్ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రోజుకు కోటి ఇరవై లక్షలు తీసుకుంటారు. అది కూడా ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ నెలల్లో మాత్రమే. అంతే కాదు గెస్ట్‌లకు మద్యం లేకుండా పార్టీని అరేంజ్ చేస్తారు. ఇక అక్టోబరు నుంచి మార్చి వరకు టూరిస్ట్ సీజన్లో బుకింగ్‌ల కోసం రోజుకు సుమారు 2 కోట్లు వసూలు చేస్తున్నారు.(Photo:Instagram)
సూర్యాఘర్ ప్యాలెస్‌లో మొత్తం 84 గదులు, 92 బెడ్రూంలు, 2 గార్డెన్లు, ఆర్టిఫిషియల్ సరస్సుతో పాటు జిమ్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, రెస్టారెంట్లు అతిధులకు అందుబాటులో ఉంటాయి. ఈ రాయల్ ప్యాలెస్‌లోనే కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా పంజాబీ సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకోనున్నారు.(Photo:Instagram)