అది అలా ఉంటే షారుఖ్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు ఓ వార్త ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. పఠాన్ మూవీతో బంపర్ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే ఓ ముఖ్య పాత్ర కోసం అల్లు అర్జున్ను జవాన్ టీమ్ సంప్రదించినట్లు టాక్ నడిచిన సంగతి తెలిసిందే. Photo : Twitter
అయితే పుష్ప2 కారణంగా బన్నికి కుదరకపోవడంతో ఆ రోల్లో ప్రస్తుతం సంజయ్ దత్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూట్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడ ఓ వేసిన ఓ సెట్లో ఓ 5 రోజుల పాటు షారూఖ్, సంజయ్ దత్‌లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట టీమ్. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. Photo : Twitter
పుష్ప2 విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ భారీ సంస్థ నుంచి పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం (అన్ని భాషల రైట్స్‌తో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా) 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప ది రూల్ సినిమా 350 కోట్లతో తెరకెక్కనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా నుంచి ఓ ఖతర్నాక్ గ్లింప్స్‌ను టీమ్ విడుదల చేయనుందని తెలుస్తోంది. “పుష్ప ది రూల్” అనే పేరుతో వస్తున్న ఈచిత్రం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రస్తుతం టీమ్ వర్క చేస్తోందని టాక్. అందులో భాగంగా సుకుమార్ ఈ గ్లింప్స్ కోసమే కొన్ని షాట్స్ చిత్రీకరిస్తున్నారట. మొన్నటి దాకా వైజాగ్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యింది.. Photo : Twitter
ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా నుంచి ఓ ఖతర్నాక్ గ్లింప్స్‌ను టీమ్ విడుదల చేయనుందని తెలుస్తోంది. “పుష్ప ది రూల్” అనే పేరుతో వస్తున్న ఈచిత్రం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రస్తుతం టీమ్ వర్క చేస్తోందని టాక్. అందులో భాగంగా సుకుమార్ ఈ గ్లింప్స్ కోసమే కొన్ని షాట్స్ చిత్రీకరిస్తున్నారట. మొన్నటి దాకా వైజాగ్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యినట్లు తెలుస్తోంది.. Photo : Twitter
అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్‌ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుందని తాజా టాక్. ఆమె ఓ 10 నిమిషాల పాత్రలో మెరవనుందట. కథను మలుపుతిప్పే పాత్రలో సాయి పల్లవి నటించనుందని, ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని అన్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ప్రస్తుతం అంతా బ్లాక్ బస్టర్ సినిమాల రీరిలీజ్‌లు అవుతోన్న నేపథ్యంలో అల్లు అర్జున్ దేశముదురు కూడా మరోసారి థియేటర్స్‌లో విడుదలకానుందని తెలుస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం ఈ సినిమా మార్చి 28, 2023న మళ్లీ విడుదల కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. దేశముదురు సినిమాకు చక్రి సంగీతం అందించగా.. హన్సిక హీరోయిన్గా నటించింది. ప్రదీప్ రావత్, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి, జీవా, సుబ్బరాజు, తెలంగాణా శకుంతల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. Photo : Twitter
అల్లు అర్జున్.. అలవైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్‌తో ఓ భారీ సినిమాను చేయన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవ్వగానే బన్నితో సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ రాబోయే సినిమాలు ఏంటో చూస్తే.. ఆయన పుష్పతో పాటు మొత్తంగా మూడు సినిమాలను ప్రస్తుతానికి ఓకే చేశారు. ఆ మూడు కూడా ప్యాన్ ఇండియా సినిమాలే.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప2కు సుకుమార్ దర్శకుడు కాగా.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ సినిమాను టీసీరిస్ నిర్మించనుంది. ఈ మూడు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో రానున్నాయి. Photo : Twitter
‘పుష్ప’ (Pushpa) విషయానికి వస్తే.. ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి కామన్ పీపుల్‌తో పాటు సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ను మెచ్చుకున్నారు. (Twitter/Photo)
హీరోగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఆర్య మూవీ కేరళలోని చాలా థియేటర్లలో 100 రోజులు ఆడింది. బన్ని వచ్చినపుడు ఎవరీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా..? ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమర్శలు వచ్చాయి. (Twitter/Photo)
బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. కానీ అల్లు అర్జున్‌పై వచ్చాయి. గంగోత్రి విడుదలైనపుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి.ఇపుడ ఏకంగా ఇండియా టుడే ఇంగ్లీష్ కవర్ పేజ్ పై నార్త్‌లో సత్తా చాటుతున్న హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఆర్ఠికల్ రాసే స్థాయికి చేరుకున్నాడు. (Twitter/Photo)