‘RRR’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 550 కోట్లకు పైగా వసూలు చేసింది. నాలుగో రోజు కూడా ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలలో కూడా దుమ్ము దులిపేస్తుంది ‘RRR’. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో అలియా భట్ చాలా అప్సెట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కేవలం 15 నిమిషాలు కూడా లేని పాత్రలో నటించింది అలియా భట్.
ముందు నుంచి కూడా ఈ సినిమాలో అలియాది చిన్న పాత్ర అని చెప్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. మరీ ముఖ్యంగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ అయితే అలియా పాత్ర చిన్నదే అయినా కీలకంగా ఉంటుందని చెప్పాడు. అయితే విడుదల తర్వాత అలియా భట్ సినిమాలో తన పాత్ర చూసి చాలా అప్సెట్ అయిందని తెలుస్తుంది. మరీ కారెక్టర్ ఆర్టిస్ట్ కంటే దారుణంగా తన పాత్ర ఉండటంతో ఆమె హర్ట్ అయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఎందుకంటే బాలీవుడ్లో ఈమె స్టార్ హీరోయిన్.. అక్కడ సినిమాకు 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. రాజీ, గంగూభాయ్ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది అలియా భట్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది ఈ బాలీవుడ్ హీరోయిన్. ఇలాంటి సమయంలో అలియాను మరీ చిన్న పాత్రకే పరిమితం చేయడంపై అభిమానులు బాగానే హర్ట్ అవుతున్నారు. తమ హీరోయిన్ పాత్ర కనీసం అరగంట కూడా లేకపోవడంపై వాళ్లు డీప్‌గా హర్ట్ అవుతున్నారు.
ఇదే విషయం అలియా వరకు వెళ్లడంతో ఈమె కూడా విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే తన సోషల్ మీడియాలో ‘RRR’ సినిమాకు సంబంధించిన చేసిన కొన్ని పోస్టులను డిలీట్ చేసింది అలియా భట్. అంతేకాదు విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్‌కు కూడా ఈమె హాజరు కాలేదు. ఒక్క పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తప్పిస్తే.. ఏ ఇంటర్వ్యూకు కానీ.. ప్రమోషన్స్‌కు కానీ హాజరు కాలేదు అలియా. దానికి కూడా కారణం ఇదే అని తెలుస్తుంది.
అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందు నుంచి రాజమౌళి చిన్న పాత్ర అని చెప్పాడు కదా.. తెలిసే చేసారు కదా.. ఇప్పుడు విడుదల తర్వాత చూసుకుని ఎందుకు బాధ పడటం అనే వాదన కూడా వస్తుంది. అప్పట్లో ఇంత చిన్న పాత్ర మీరెందుకు చేస్తున్నారు అని అడిగితే.. రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర కాదు.. అలా మెరిసి మాయం అవమన్నా అవుతాను అంటూ తెలిపింది అలియా. అలాంటిది ఇప్పుడెందుకు ‘RRR’ సినిమా పోస్టులను డిలీట్ చేసిందో అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు.
ప్రస్తుతం కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఈమెను హీరోయిన్గా అనుకుంటున్నారు. అయితే RRR విడుదలైన తర్వాత ఇకపై తెలుగులో నటించకూడదని అలియా నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ చెప్పేదొకటి చేసేదొకటి అని సన్నిహితుల దగ్గర ఈమె చెప్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో మరింత సమాచారం రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!