సోషల్‌మీడియాలో హీరోయిన్లకు సాధారణంగా ఫాలోవర్లు చాలా సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై మెరిసే అందాల భామలకు ఫాలోవర్లుండటం సహజమే. కానీ ఆమె ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. కానీ ఇన్ స్టాగ్రామ్‌లో ఆ బ్యూటీకున్న ఫాలోవర్లు మాత్రం 2 మిలియన్లకు పైనే. (Photo Credit : Instagram)
ఇంతకీ ఆ సుందరి ఎవరనే కదా మీ డౌటు. రాజ్ పుత్ వంశానికి చెందిన మీరా రాజ్‌పుత్ (Mira Rajput). ఈమె హీరోయినేం కాదు. కానీ బాలీవుడ్ సర్కిల్స్‌లో ఈమె తెలియని వాళ్లుండరు. హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) భార్యనే ఈ అందాల భామ. కిల్లింగ్ లుక్స్, వెరైటీ డ్రెస్సులతో తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Photo Credit : Instagram)
షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల మీరా సోషల్ మీడియాలో ఒక సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సమయంలో మీరాను మీ అభిమాన ప్రముఖులు షాహిద్ కపూర్ లేదా ఏబి డివిలియర్స్ (AB De Villiers) అని అడిగారు. మీరా షాహిద్ పేరు తీసుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె డివిలియర్స్ పేరు ఎంచుకుంది. ఇది కాకుండా ఈ ప్రశ్నకు లైఫ్‌లైన్‌ను ఉపయోగిస్తానని ఆశ్చర్యపరిచింది. (Photo Credit : Instagram)
ఇక అభిమానుల అడిగిన ప్రశ్నలకు చాలా ఫన్నీగా సమాధానమిచ్చింది మీరా. భర్త, పిల్లల్లో ఎవరంటే ఇష్టమంటే.. ఇద్దరూ అంటూ సమాధానమిచ్చింది. బాయ్ ఫ్రెండ్ గా షాహిద్ అంటే ఇష్టమా.. లేదా భర్తగా షాహిద్ అంటే ఇష్టమా అని ఫ్యాన్స్ అడిగితే.. ఇది ఒకటి కొంటే మరొకటి ఫ్రీ లాంటిది అని ఫన్నీగా సమాధానమిచ్చింది. (Photo Credit : Instagram)
గతంలో మీరా తన ఆకర్షణీయమైన శైలితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కొద్ది రోజుల క్రితం మీరా సోషల్ మీడియాలో చాలా ఇష్టపడిన హాట్ ఫోటోను షేర్ చేసింది. అసలైన మీరా తన ఫోటోను ప్రింటెడ్ స్విమ్‌సూట్‌లో పంచుకుంది. మీరా తనను తాను ఆరోగ్యంగా ఉంచడానికి షాహిద్ కపూర్‌తో కలిసి జిమ్‌లో చేరినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరూ ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నామని చెప్పింది. (Photo Credit : Instagram)
మీరా, షాహిద్‌ని వివాహం చేసుకుని 6 ఏళ్లు అయింది. షాహిద్ పరిపూర్ణ కుటుంబ వ్యక్తి. అతను సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో సమయాన్ని గడుపుతాడు. అదే సమయంలో మీరా కూడా షాహిద్‌కు మద్దతు ఇస్తుంది. మీరా సినీ పరిశ్రమకు చెందినది కాదు. అయినప్పటికీ ఆమె షాహిద్ పనిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. షాహిద్ జీవితాన్ని చూడటం ద్వారా ఇప్పుడు మీరా కూడా సినిమాల్లోకి రావాలనుకుంటుందా తెలియడం లేదు. (Photo Credit : Instagram)
షాహిద్ కపూర్ వృత్తి జీవితం గురించి మాట్లాడుతూ.. త్వరలో జెర్సీ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అతను క్రికెటర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో షాహిద్‌తో కలిసి మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు చిత్రం ‘జెర్సీ’ కి రీమేక్. ఈ చిత్రం దీపావళికి ఈ ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది. (Photo Credit : Instagram)