బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీని మ్యారేజ్ చేసుకున్న అనుష్క తన క్రేజ్ ఇంకా పెంచేసుకుందని చెప్పొచ్చు. ఆదిత్య చోప్రా డైరెక్షన్లో తెరకెక్కిన ‘రబ్ నే బనా ది జోడి’ ఫిల్మ్‌తో హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ అయిన ఈ భామ.. టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. (Image Credit : Instagram)
డెలివరీ తర్వాత కూతురి కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ... మళ్లీ వరుసగా సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక, లేటెస్ట్ గా గ్రీన్ కలర్ బికినీలో హాట్ ఫోటోలు షేర్ చేసింది అనుష్క శర్మ. స్మిమ్మింగ్ పూల్‌లో అనుష్క కనిపించింది. నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫోటోలపై విరాట్ కోహ్లీ రొమాంటిక్ కామెంట్ చేశాడు. (Image Credit : Instagram)
హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగానూ ప్రేక్షకుల్ని అలరించిన అనుష్క శర్మ.. 2017 డిసెంబరులో విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. ఇటీవలే విరాట్- అనుష్క జోడీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో హీటు పుట్టించే ఫొటోస్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది అనుష్క శర్మ. (Image Credit : Instagram)