బాలీవుడ్లో ప్రస్తుతం రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయా అని అంతా వణికిపోతున్నారు. ముంబైలో పోర్నోగ్రఫీ రాకెట్ ఇంతగా పెరిగిపోయిందా.. ఈ స్థాయిలో పాకిపోయిందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రైమ్ బ్రాండ్ పోలీసులకు కూడా కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. ఆ స్థాయిలో పోర్న్ కుంభకోణం బయటపడుతుంది.
రాజ్ కుంద్రా ఇప్పట్లో ఈ కేసు నుంచి బయటికి వచ్చేలా కనిపించడం లేదు. ఈయన తాజాగా జైలుకు కూడా తరలించారు. ఈ కేసులో భర్త అరెస్ట్ కావడంతో శిల్పా శెట్టి పేరు కూడా చెడిపోతుంది. ఈమె ఇమేజ్‌కు కూడా భంగం వాటిల్లుతుంది. ఇన్నేళ్ళుగా తాను కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం భర్త చేసిన పనితో గంగపాలు అయిపోయిందని శిల్పా శెట్టి బాధ పడుతున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై ఫ్యాన్స్ కూడా ఈమెను బాగానే ట్రోల్ చేస్తున్నారు. భర్త ఏం బిజినెస్ చేస్తున్నాడో.. భార్యకు తెలియకుండా ఉంటుందా.. ఇవన్నీ శిల్పాకు తెలియకుండా జరిగిందంటే నమ్మాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్ కుంద్రా నిర్వహించిన పోర్న్ చిత్రాల వ్యవహారం గురించి శిల్పా శెట్టికి తెలియదు.
దాంతో ఈ కేసు గురించి శిల్పాను విచారిస్తున్న సమయంలోనూ భర్తను చూసి శిల్పా శెట్టి పట్టలేనంత ఆవేశానికి లోనైందని వార్తలొస్తున్నాయి. అంతేకాదు భర్తను కొట్టడానికి కూడా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత భర్త చేసిన పని తలుచుకుని శిల్పాశెట్టి బోరున ఏడ్చారని తెలుస్తుంది.
డబ్బు కోసం ఇలాంటి నీచపు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భర్తను ఈమె నిలదీసినట్లు పోలీసులు చెప్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతూనే శిల్పా శెట్టి ఆపకుండా కంటతడి పెట్టుకున్నారని మీడియా కథనాలు చెప్తున్నాయి. రాజ్ కుంద్రా చేసిన పనితో తను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ పాడైపోయాయనని.. కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు క్యాన్సిల్ కావడంతో తాను ఆర్థికంగానూ చాలా నష్టోపోయానని చెప్తుంది.