బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్ కపూర్, అలియాభట్ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(Amithab Bachchan, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున(Nagarjuna), మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Twitter/Photo)
బ్రహ్మస్త్ర సినిమాను బాయ్ కట్ చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ విజువల్ వండర్ లా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి అంచనాలతో నెగిటివిటీ కూడా భారీ లెవెల్లోనే వచ్చినా నెక్స్ట్ మాత్రం ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసింది.
బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించి.. కంటెంట్ పరంగా వీక్.. కానీ గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. షారుక్, అమితాబ్, నాగార్జున , మౌనీ రాయ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. దీంతో వీరంతా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నాగార్జునతో రాజమౌళి సమర్ఫకుడిగా ఉండటం చూసి థియేటర్స్‌కు మొదటి మూడు రోజులు జనం పరుగులు పెట్టారు.
'సకల అస్త్రాలకు దేవత' - ఇదీ 'బ్రహ్మాస్త్ర' సినిమా కాప్షన్. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం అంటూ చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఇక విడుదలైన ట్రైలర్ చూస్తే... ఆ యుద్ధం భారీగా ఉండబోతుందని, ఈ సినిమా ఓ విజువల్ వండర్ అని అర్థం అవుతోంది. 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్లో కథేంటి? అనేది క్లియర్‌గా చెప్పారు.