Bollywood Highest Gross Films | ఒకప్పుడు భారతీయ సినిమాలంటే హిందీ సినిమాల పేర్లు చెప్పేవారు. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమాతో దక్షిణాది సినిమాల సత్తా ఏమిటో బాలీవుడ్‌కు తెలిసింది. అంతేకాదు అక్కడ ఫస్ట్ డే హిందీలో మంచి వసూళ్లను సాధించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ హిందీలో రూ. 20 కోట్ల వరకు మొదటి రోజు వసూళ్లను సాధించింది. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 హిందీలో రూ. 53.95 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు హిందీ చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ ఈ రికార్డును బ్రేక్ చేసి హీరోగా తన స్టామినా ఏంటో చూపించాడు. తాజాగా ఈ సినిమా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
టాప్ 3 : పఠాన్ | షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన సినిమా పఠాన్. దీపికా పదుకొణే కథానాాయికగా నటించింది. ఇండియన్ స్పై ఏజెన్సీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మొదటి రోజు బాలీవుడ్లో రూ. 55 కోట్ల అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన 7 రోజుల్లో రూ. 300 కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన తొలి బాలీవుడ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. తాజాగా దంగల్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ దాటి రూ. 388 నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో మూడో ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)