ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తోంది కృతిసనన్. ఈ చిత్రంలో సీతమ్మ తల్లి పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్న ఈ 'ఆదిపురుష్' మూవీ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. చిత్రంలో సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.