Kiara Advani: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించి మంచి సక్సెస్ అందుకోగా..ఈ సినిమా విడుదలై జూన్ 21న రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని విషయాలు పంచుకుంది. జూన్ తనకు లక్కీ నెల అని, క్యాలెండర్ లో ఆరో నెల అంటే తనకు బాగా కలిసి వస్తుందని, కబీర్ సింగ్ విడుదలై రెండేళ్లు కాగా ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.