శరీరాన్ని తెగ కష్టపెడుతున్న బెబో..ఆ గది అంటేనే తనకిష్టమంటోన్న కరీనాకపూర్
శరీరాన్ని తెగ కష్టపెడుతున్న బెబో..ఆ గది అంటేనే తనకిష్టమంటోన్న కరీనాకపూర్
Kareena Kapoor: బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ మళ్లీ గ్లామర్‌పై ఫోకస్ పెట్టింది. కోవిడ్ కారణంగా కాస్త ఒళ్లు చేశానను అనుకుందో ఏమో వెంటనే మళ్లీ యోగా, ఎక్సర్‌సైజ్‌లతో బిజీ అయింది. తనకిష్టమైన గదిలోకి వచ్చానంటూ ఫ్యాన్స్‌కి తన యోగా అప్డేట్స్ షేర్ చేసుకుంది.
బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ కరీనా కపూర్ మళ్లీ క్యాజ్యువల్ లైఫ్‌లోకి వచ్చింది. కరీనా పేరు కరోనా మహమ్మారికి నచ్చిందో ఏమో వైరస్ బెబోను వదిలిపెట్టగానే వెంటనే యాక్టివ్ అయ్యింది. శరీరాన్ని తెగ శ్రమపెడుతోంది.
2/ 6
కోవిడ్ నుంచి బయటపడగానే ఇంట్లో తనకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లింది బెబో. ఐసోలేషన్‌లో ఉండి బోర్ కొట్టిందో ఏమో మళ్లీ ఫిట్నెస్ మోడ్‌లోకి వెళ్లిపోయి యోగా పేరుతో తన శరీరాన్ని మెలికలు తిప్పేస్తోంది కరీనా కపూర్.
3/ 6
శరీర సౌష్టవాన్ని ఏమాత్రం చెక్కు చెదరనివ్వని కరీనాకపూర్..చివరకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా యోగా మానలేదు. కడుపులో బిడ్డతో కూడా హెల్దీ ఎక్సర్సైజ్లు చేసిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుందంటే బెబోకి తన బాడీ మీద ఎంత శ్రద్ధ అంటున్నారు ఫ్యాన్స్.
4/ 6
నాలుగు పదుల వయసు దాటినా ఇంకా నిగనిగలాడే గ్లామర్ మెయిన్‌టెన్ చేసే కరీనాకపూర్ యోగా, ఎక్సర్సైజ్లకు ఇచ్చేంత ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వదంట. అందుకే రన్నింగ్ మీటర్ వాల్యూని కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
5/ 6
తనకిష్టమైన యోగా, ఎక్సర్సైజ్లు చేసుకునే ప్రదేశాన్ని తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. కరీనా కపూర్. బెబో యాక్ట్ చేసిన లాల్ సింగ్ చద్దా మూవీ ఈ ఇయర్లో రిలీజవబోతోంది. ఈమూవీ తర్వాత మళ్లీ బిజీ అవుతుందేమో.
6/ 6
కరీనా యోగా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అంతా డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. ఒకరు లవ్ ద కార్ అంటే మరొకరు అవర్ పూ ఈజ్ బ్యాక్ అంటూ మెసేజ్ చేశారు. ఇంకో అభిమాని అయితే యు లుక్ ఎనర్జిటిక్ ఆల్వేస్ అంటూ పొగుడుతూ కామెంట్ పోస్ట్ చేశాడు.