మొన్నటి వరకు ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె పెళ్లి, ప్రెగ్నెంట్ అంటూ కాస్తా బిజీ అయ్యింది. దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఫిక్స్ చేశారని సమాచారం. Janhvi Kapoor Jr Ntr (Photo Twitter)
జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అయితే ఎప్పుడు నుంచో ఎన్టీఆర్ వర్క్ చెయ్యాలని ఉబలాట పడుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ అంశంపై అతి త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది. Photo twitter
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ... అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.Photo : Instagram
ఇక బోనీ కపూర్ ఆ మధ్య మాట్లాడుతూ.. మాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎంతో అభిమానం. ఇక్కడ సినిమాల్లో నటించడంతోనే శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ స్టార్‌గా సత్తా చాటిన విషయాన్ని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మంచి కథ దొరికితే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జాన్వీ తప్పకుండా నటిస్తుందని చెప్పుకొచ్చారు. Photo : Instagram