ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.తెలుగు సహా సౌత్ ఇండస్ట్రీలో ఇపుడు బాలీవుడ్ హీరోలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి వంటివాళ్లు తెలుగులో నటించారు. ఇపుడు అజయ్ దేవ్గణ్ ఆర్ఆర్ఆర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్ల కంటే ముందు తెలుగులో నటించిన బాలీవుడ్ హీరోలు ఇంకెవరున్నారంటే.. (File/Photos)
సల్మాన్ ఖాన్ | సల్మాన్ ఖాన్.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసారు. మలయాళం లూసీఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేేస్తున్నారు. ఈ చిత్రంతో సల్మాన్ తెలుగు ఎంట్రీ ఇవ్వనున్నారు.ఈ సినిమాను తెలుగు, హిందీలో రిలీజ్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. (Twitter/Photo)
అజయ్ దేవ్గణ్ | ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్గణ్. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ( (RRR movie shooting pic)
అజయ్ దేవ్గణ్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘మక్కీ’లో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ హిందీ రీమేక్ ‘సన్నాఫ్ సర్ధార్’లో నటించారు. ఈ రకంగా జక్కన్నతో అజయ్ దేవ్గణ్ కు మంచి అనుబంధమే ఉంది. (Twitter/RRRMovie)
సంజయ్ దత్ | కేజీఎఫ్ మూవీకి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2లో సంజయ్ దత్ మెయిన్ విలన్ అథీరా పాత్రలో ఇరగదీసారు. అంతకు ముందు సంజు బాబా నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’లో కాసేపు తెరపై కనిపించిన సంగతి తెలిసిందే కదా. KGF 2 మూవీని ఏప్రిల్ 14న విడుదలై ఈ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ మూవీగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
అమితాబ్ బచ్చన్ | అమితాబ్ బచ్చన్..చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో యాక్ట్ చేసారు. అంతకు ముందు బిగ్ బీ.. అక్కినేని కుటుంబం మొత్తం నటించిన ‘మనం’లో కాసేపు తెరపై అలా కనిపించి కనువిందు చేసారు. మరోసారి ఈయన ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’లో నటిస్తున్నారు. (Twitter/Photo)