సీన్ కట్ చేస్తే అజయ్‌దేవ్‌గన్..తన 11రోజుల అయ్యప్ప దీక్ష ముగియగానే సాధారణ భక్తుడిగా శబరిమలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. తన ఆధ్యాత్మిక యాత్రలో కూడ అజయ్‌దేవ్‌గన్ ఎక్కడా సెలబ్రిటీ హోదాలో కాకుండా సాధారణ భక్తుడిగా తన పర్యటనను ముగించారు. ఆ ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోని కూడా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు అజయ్‌దేవ్‌గన్.