బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. మలయాళంలో హిట్టైన దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌కు ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో తెలుగులో దృశ్యం 2 ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘దృశ్యం 2’ మూవీ థియేట్రికల్‌గా విడుదలై ఇపుడు సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. (Twitter/Photo)
దృశ్యం 2 మొదటి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా రెండో రోజు రూ. 21.59 కోట్లు వసూళ్లను సాధిస్తే.. మూడు రోజు రూ. 27.17 కోట్లు వసూళ్లు చేసి ఫస్ట్ వీకెండ్లోనే రూ. 63 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. ఆతర్వాత వరుసగా ఈ సినిమా సోమవారం రూ. 11.87 కోట్లు.. మంగళ వారం రూ. 10.48 కోట్లు.. బుధవారం రూ. 9.55 కోట్లు.. గురువారం రూ. 8.62 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను సాధించడం పెద్ద విషయం కాదనేది దృశ్యం 2 సక్సెస్‌తో మరోసారి ప్రూవ్ అయింది. మొత్తంగా దృశ్యం సినిమాలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన దృశ్యం 2 కూడా యూనివర్సల్ కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. మొత్తంగా దృశ్యం 2 సక్సెస్‌తో బాలీవుడ్ మరోసారి ఊపిరి పీల్చుకుంది. (Twitter/Photo)