Pics: రణ్‌వీర్ టూ రణ్‌వీర్ 2018లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ సినిమాలు

వందేళ్ల భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. కలెక్షన్ల వేటలో కోట్లు కొల్లగొడుతోంది. హండ్రెడ్ క్రోర్ క్లబ్ కొలమానంగా మారిపోయిందిప్పుడు. సినిమా హిట్టా... ఫట్టా అన్న ఈక్వేషన్‌కి హండ్రెడ్ క్రోర్ క్లబ్బే మైల్ స్టోన్‌గా మారిపోయింది. ఇక బాలీవుడ్ సినిమాలకు పోటీగా దక్షిణాది చిత్రాలు కూడా రూ.వంద కోట్లను ఈజీగా కొల్లగొడుతున్నాయి. తాజాగా 2018 చివర్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘సింబా’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లను కొల్లగొట్టింది. తాజాగా ‘సింబా’ సక్సెస్‌తో దీపికా పదుకొణే లేకుండా సోలోగా రణ్‌వీర్ భారీ హిట్ అందుకున్నాడు. లాస్ట్ వీకెండ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లను కొల్లగొట్టి భారీ హిట్ దిశగా ప్రయాణిస్తోంది. 2018లో ‘సింబా’తో కలిపి మొత్తంగా 13 చిత్రాలు వంద కోట్ల మైలురాయిని అందుకున్నాయి.