ఈ జంట ప్రేమకు ముందు కుటుంబ సమ్మతి లేదు. తరువాత ఇద్దరూ కలిసి ఇరు కుటుంబాలను ఒప్పించారట. దాంతో రెండు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించాయి. ఈ జంటకు పెళ్లై ఇప్పటికి 29 సంవత్సరాలు. వచ్చే ఏడాదికి 30 ఏళ్లు నిండనున్నాయి. బాలీవుడ్ లో చాలా మంది విడిపోయి.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం మాత్రం చెక్కు చెదరలేదు.