సినీ తారల ఫేవరెట్ ఫ్యాషన్ డిజైనర్ లక్ష్మీలెహర్

Lakshmi Lehr : టాలీవుడ్‌లో అదిరిపోయే హిట్స్ రాగానే... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పూజా హెగ్డే ఈమధ్య స్టైలిష్ డ్రెస్సుల్లో తళుక్కుమంటోంది. ఇందుకు కారణం... ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహరే. ఒకప్పుడు పేరూ ఊరూ లేని లక్ష్మీ లెహర్... ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా మంది హీరో, హీరోయిన్లకు సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్నారు. హృతిక్ రోషన్, కరీనా కపూర్, పూజా హెగ్డే, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, సారా అలీఖాన్, అలియాభట్, జాన్వీ కపూర్, తారా సుతారియా ఇలా ఎంతో మంది సెలబ్రిటీలకు ఇప్పుడు ఆమె స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సింపుల్ అండ్ క్యూట్ ఇదీ ఆమె నమ్మే ఫార్ములా. అందువల్ల లక్ష్మీ లెహర్ తయారుచేసే డ్రెస్సుల్లో అతి ఎక్కడా ఉండదు. సింపుల్‌గా చూడచక్కగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు డ్రెస్సింగ్స్ ఇస్తుండటంతో... బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు ఫ్యాన్స్ అయిపోతున్నారు.