బాలీవుడ్‌లో వరసగా ఓటిటి రిలీజ్‌లు.. భారీ సినిమాలు క్యూ..

థియేటర్స్ అన్నీ మూత పడటంతో సినిమా వినోదం దూరం అయిపోయింది. ప్రేక్షకులకు కూడా ఎంటర్‌టైన్మెంట్ లేకుండా పోయింది. ఎంతసేపూ టీవీలో కరోనా వార్తలే తప్ప మరో న్యూస్ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్లాన్ సిద్ధం చేసారు. భారీ సినిమాలను కూడా ఆన్‌లైన్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటి రెండు కాదు.. చాలా సినిమాలు ఇప్పుడు ఓటిటిలో విడుదలవుతున్నాయి.