Raveena Tandon: రవీనా టాండన్ మనవడు ఎలా ఉన్నాడో తెలుసా..?
Raveena Tandon: రవీనా టాండన్ మనవడు ఎలా ఉన్నాడో తెలుసా..?
Raveena Tandon: రవీనా టాండన్.. ఈ పేరుకు తెలుగులో కూడా మంచి పేరు ఉంది. ఇక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది ఈమె. 90ల్లో బాలయ్య, నాగార్జున, మోహన్ బాబు లాంటి..
రవీనా టాండన్.. ఈ పేరుకు తెలుగులో కూడా మంచి పేరు ఉంది. ఇక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది ఈమె. 90ల్లో బాలయ్య, నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలతో నటించింది రవీనా టాండన్. అప్పట్లో అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది రవీనా.
2/ 7
ఇదిలా ఉంటే అప్పుడే అమ్మమ్మ కూడా అయిపోయింది. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. 50 ఏళ్లు కూడా నిండకుండానే ఈమె అమ్మమ్మ అయిపోయింది. మనవడితో పోజులు కూడా ఇచ్చింది రవీనా.
3/ 7
ఈమె అమ్మమ్మగా మారి కూడా ఏడాది అయిపోయింది. లాక్డౌన్ సమయంలో తన బుజ్జి మనవడిని ఎత్తుకుని పోజులిచ్చింది రవీనా టాండన్. మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ పోస్ట్ చేస్తుంది రవీనా టాండన్.
4/ 7
ఈమెకు 21 ఏళ్లున్నపుడే 1995లో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది రవీనా. వాళ్లెవరో కాదు చనిపోయిన తన కజిన్ పిల్లలే. వాళ్ల బాధ్యతను కూడా ఈమె తీసుకుంది.
5/ 7
ఆ తర్వాత 2004లో అనిల్ తడానీతో పెళ్లైన తర్వాత రణబీర్వర్ధన్, రష అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది రవీనా టాండన్. ఇదిలా ఉంటే 2019 సెప్టెంబర్లో పెంచుకున్న అమ్మాయి ఛాయ తల్లి అయింది.
6/ 7
అలా ఈమె అమ్మమ్మ అయిపోయింది. ఛాయకు పుట్టిన బాబుకు రుద్ర అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ బుడ్డోడితో దిగిన ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.
7/ 7
లాక్డౌన్ సమయంలో కలవలేకపోవడంతో కూతురు ఛాయకు వీడియో కాల్ చేసి రుద్ర ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. రోజుకు కనీసం ఒక్కసారైనా బుడ్డోన్ని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్.