కెజిఎఫ్-2 టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రవీనా టాండన్ పలు ఆంగ్ల ఛానెళ్లకు ప్రత్యక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్ర హీరో యశ్ అద్భుతమైన నటుడని ఆమె కొనియాడారు. యశ్ సూపర్ టాలెంటెడ్ అని.. అతడితో కలిసి పని చేయడం తనకు ఎంతగానో నచ్చిందని తెలిపింది.
రవీనా స్పందిస్తూ... ‘యశ్ మంచి ప్రతిభావంతమైన నటుడు. అతడి వ్యక్తిత్వం కూడా గొప్పగా అనిపిస్తుంది. అతడితో చేయడాన్ని నేను ఎంజాయ్ చేశాను.. నా అభిమానులు కూడా ఈ సినిమాలో నేను చేయాలని కోరుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది. నా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది..’ అని అన్నారు.
ఈ చిత్ర కథాంశం తనను చాలా ఆకట్టుకున్నదని రవీనా తెలిపింది. ‘చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ నా దగ్గరకు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇదో కొత్త జానర్. కథ చెబుతున్నప్పుడు పొందిన అనుభూతి సినిమా తెరకెక్కినప్పుడు కూడా కలిగింది. ప్రశాంత్ నీల్ మాములోడు కాదు. అతడి ఆలోచనలు సామాన్య మానవుల ఊహకందవు..’ అంటూ ప్రశంసించారు. (Twitter/Photo)