ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన స్టార్ హీరోయిన్ ప్రియాంకచోప్రా తన ఒడిలో కూతురు మాల్తీని ఎత్తుకొని ముసిముసి నవ్వులు చిందిస్తూ అందర్ని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రియాంకచోప్రా ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. భారత గడ్డపై నిక్ జోనాస్‌తో కలిసి స్వదేశీ అమ్మాయిని చూడటం చాలా హ్యాపీగా ఉందంటున్నారు నెటిజన్లు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ ఒకరికొకరు పరిపూర్ణ జంటలా కనిపించారు. పింక్ కో-ఆర్డ్ సెట్లో ఆమె అద్భుతంగా కనిపించింది. సింగిల్ లెగ్‌కి కట్ చేసిన డిజైన్‌తో థైస్ చూపిస్తూ క్రాప్ టాప్‌లో ఆమె అందాలు నెటిజన్లను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశాయి. కాళ్లకు బూట్లు వేసుకుని, నల్లటి సన్ గ్లాసెస్ ధరించి ఉన్నాడు. కాగా, నిక్ బ్లూ హూడీ మరియు డెనిమ్ జీన్స్‌లో కనిపించాడు.