బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే దీనిపై నటి పరిణీతి చోప్రా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. (ఫోటో: Instagram)
2/ 8
స్టార్ హీరోయిన్ పరిణీతి యంగ్ ఎంపీ రాఘవ్ చద్దా మధ్యలో కుచ్ కుచ్ హోతాహై అని అంతా అంటున్నారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా , చోప్రా కలిసి ఉన్న ఫోటోలు ప్రతిచోటా వైరల్ అవుతున్నాయి.
3/ 8
ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి పరిణీతి చోప్రా, యువ హీరో రాఘవ్ చద్దా కలిసి బయటకు వచ్చారు. కానీ పరిణీతి చోప్రా ఏమీ మాట్లాడలేదు, ఇద్దరూ కలిసి మీడియాకు పోజులిచ్చి వెళ్లిపోయారు. ఇద్దరు వైట్ కలర్ షర్టులో మెరిశారు. (ఫోటో: Instagram)
4/ 8
ఈ బాలీవుడ్ బ్యూటీ ఎక్స్పర్ట్ ఓ యువ పొలిటీషియన్తో ప్రేమాయణం సాగిస్తోందనే వార్త సర్వత్రా వ్యాపిస్తోంది. ఇటీవల ఇద్దరూ కలిసి కనిపించడం... ఒకే కారులో కలిసి తిరగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. (ఫోటో: Instagram)
5/ 8
పార్లమెంటు నుంచి బయటకు వస్తుండగా రాఘవ్ చద్దాను ఓ విలేకరి ...పరిణితి చోప్రాతో ఉన్న రిలేషిన్ పై అడుగుతూ ‘మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నించారు.. దీనికి రాఘవ్ బదులిస్తూ రాజకీయాల గురించి ప్రశ్నిస్తే మాట్లాడతానని పర్సనల్ విషయాలు ఏం చెప్పలేనని బదులిచ్చారు. (ఫోటో: Instagram)
6/ 8
మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్నకు రాఘవ్ చద్దా స్పందిస్తూ.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో చెబుతానని బదులిచ్చారు. అయితే రాఘవ్ పెళ్లిపై క్లారిటీ ఇవ్వడంతో వారి మధ్య ప్రేమ ఉందనే ఆలోచనకు ఈ వ్యాఖ్యలు వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని మరింత బలం చేకూర్చే విధంగా మారాయి. (ఫోటో: Instagram)
7/ 8
పరిణీతి చోప్రా బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆమె మంచి నటిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజుల్లో పరిణీతి చోప్రా పెద్ద సినిమాల్లో నటించకపోవడానికి వీరిద్దరి ప్రేమకథే కారణమని అంటున్నారు. (ఫోటో: Instagram)
8/ 8
అయితే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి కుటుంసభ్యులకు కూడా తెలుసునని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.