టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించి టీమ్ ఓ వీడియోను కూడా వదిలింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo Twitter
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ వారం రోజులు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలుకానుందని తెలిపారు చిత్ర నిర్మాత నాగవంశీ..
వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్‌తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్‌కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట. Photo : Twitter