మలైకా అరోరా చాలా చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో మాయ చేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంది. దీంతో ఆమెతో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా ఎంపికైంది. దీంతో ఈ అమ్మడు అప్పట్లోనే బాగా పాపులర్ అయింది. దీంతో సినిమాలు, షోలు చేసే ఛాన్స్‌ను కూడా అందుకుని సత్తా చాటుకుంది. (Photo:Instagram)
మోడల్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే మలైకా సినిమాల్లో నటించింది. కానీ, అంతగా గుర్తింపు రాలేదు. అయితే, హిందీలో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి ఐటెం సాంగ్స్ చేసి ఫేమస్ అయింది. అలాగే, తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేశ్ బాబు 'అతిథి', 'గబ్బర్ సింగ్' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.(Photo:Instagram)