కియారా అద్వానీ ఆ హీరోతో ప్రేమలో ఉందా.. ఇదిగో సాక్ష్యం..
కియారా అద్వానీ ఆ హీరోతో ప్రేమలో ఉందా.. ఇదిగో సాక్ష్యం..
Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.
భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.
2/ 7
ఈ రెండు సినిమాల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరంగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్లో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే అక్కడ ఎమ్మెస్ ధోనీతో పాటు కబీర్ సింగ్ లాంటి సంచలన సినిమాలు చేసింది.
3/ 7
ప్రస్తుతం లక్ష్మీ బాంబ్, కార్గిల్ వార్ ఆధారంగా తెరకెక్కుతున్న కెప్టెన్ విక్రమ్ బాత్రాతో పాటు మరో రెండు మూడు సినిమాలు చేస్తుంది కియారా అద్వానీ.
4/ 7
ఇందులో విక్రమ్ బాత్రా సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తుంది కియారా. ప్రస్తుతం ఈయనతోనే ఈమె ప్రేమలో ఉందనే టాక్ బాలీవుడ్లో బాగా వినిపిస్తుంది.
5/ 7
చాలా రోజులుగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని.. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడిపోయారని టాక్ అయితే బాగానే వినిపిస్తుంది ఉత్తరాదిన. ఇప్పుడు దీనికి సాక్ష్యంగా సిద్దార్థ్ మల్హోత్రా మరో పని చేసాడు.
6/ 7
అదేంటంటే.. కియారా అద్వానీ పుట్టిన రోజుకు సిద్ధూ చెప్పిన విషెస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హ్యాపీ బర్త్ డే సన్ షైన్ గాళ్.. బిగ్ లవ్ అండ్ హగ్స్ అంటూ రాసుకొచ్చాడు. దానికి కియారా అద్వానీ నుంచి కూడా ఆసక్తికరమైన రిప్లై వచ్చింది.
7/ 7
థ్యాంక్ యూ మంకీ అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరి ఛాటింగ్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.